Telugu ugadi celebrations in 2024 complete information

ugadi అనగానే తెలుగు వారికి గుర్తొచ్చేది ఏమిటంటే తెలుగు వారి నూతన పండుగ ఆంధ్ర,తెలంగాణ ప్రజలు ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని ఎక్కువగా  నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు ఇచ్చిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చింది అని పురాణ పజల నమ్మకం. బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని  చైత్ర మాస శుక్లపక్ష మొదటి రోజున  సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి సంబందించి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన శుభదినం కారణంగా ఈ పండుగ ప్రాచుర్యంలోకి  వచ్చిందని మరొక గాథ. ఉంది “యుగాది” అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. “ఉగ” అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’ ‘ఉగాది’.అంటే సృష్టి ప్రారంబం అయినది అప్పుడే అని అందుకే “ఉగాది అని పిలుస్తారు. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా ప్రజలు పిలవబడుతున్నారు. ప్రతి సంవస్త్రం ఉగాది డేట్ మారుతూ ఉంటుంది ఒకేలా ఉండదు కానీ ఈ సంవస్త్రం ఏప్రిల్ 9,2024 నా జరుపుకుంటున్నాము .

Ugadi is called by various names

హిందువులకు అత్యంత ముఖ్యమైన  ఈ ఉగాది పండుగను  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పిలిస్తే మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ పేరుతో పిలుస్తారు. తమిళులు “పుత్తాండు” అనే పేరుతో, మలయాళీలు “విషు” అనే పేరుతోను, సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు. అయితే పండుగను ఎక్కడ జరుపుకున్న పెద్దగా తేడా ఏమి ఉండదు ఎందుకంటే బాష మారినంత మాత్రాన బావమేమి మారదు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఏదైనా మంచి పనిని మొదలు పెట్టేటప్పుడు ఎక్కువగా ఉగాది రోజున ప్రారంబించాలనుకుంటారు.

Spring is in Ugadi

శిశిర ఋతువు ఆకురాలే కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు కొత్తగా చిగుర్చి ప్రకృతి అందంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ఉదయాన్నే లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.”ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం.

Importance of Ugadi

ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలకు ముందుగానే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని సంఘటనల యొక్క అంతర్లీనాన్ని గురించిన భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. అని మన తెలుగు ప్రజలు ఎక్కువగా నమ్మేవారు.

  • బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
  • ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
  • వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
  • చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
  • పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు
  • కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.

Leave a Comment