Tillu square movie reveiw in telugu

టైటిల్ : టిల్లు స్క్వేర్

విడుధల తేదీ : మార్చి 29, 2024

నటీనటులు : సిద్దు జొన్నల గడ్డ , అనుపమ పరమేశ్వరన్ , ప్రిన్స్ , మురళీధర్ గౌడ్ ,మురలి శర్మ తదితరులు.

నిర్మాణ సంస్థ : సితార ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

దర్శకత్వం : మల్లిక్ రామ్

రచయిత : సిద్దు జొన్నల గడ్డ ,రవి ఆంటోని

మ్యూజిక్ : భీమ్స్ సిసిలోరియో

సినిమాటోగ్రఫి : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు

ఎడిటింగ్ : నవీన్ నూలి

tillu square story

స్టార్ బాయ్ సిద్ధు మరియు అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ కలిసి మొదటిసారిగా నటించిన చిత్రమే Tillu square movie నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ని క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఆసక్తిని పెంచాయి . ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూశారు. చాలాసార్లు వాయిదా పడినప్పటికి సినిమాపై అంచనాలు ఏమాత్రం మారలేధు. ఎట్టకేలకు నేడు(మార్చి 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

how is tillu square movie

‘డీజే టిల్లు’ సక్సెస్ కావడానికి ముఖ్యకారణం టిల్లుగాడి పాత్ర. ఆ పాత్రతో పలికించిన సంభాషణలు, ప్రతి సీన్లో కామిడీ చాలా చాలా కొత్తగా ఉంటూంధి . కథగా చూసుకుంటే ‘డీజే టిల్లు’లో కొత్తదనం ఏమి ఉండదు. కానీ టిల్లుగాడి మ్యానరిజం తప్ప .. ఆ పాత్ర చేసిన ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్స్ ఆ చిత్రానికి మంచి పేరును తెచ్చి పెట్టాయి. ..అందుకే ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తీ శారు . ‘టిల్లు స్క్వేర్’లోనూ అంతకు మించి మంచిగా నటించారు.దర్శకరచయితలు. కథను మీధ కాకుండా టిల్లుగాడి మరియు లిల్లీల పాత్రల కారెక్టరైజేషన్ను నమ్ముకున్నారు. సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రల చుట్టే త

what is tillu square movie

ప్రేక్షకులకు అల్రెడీ టిల్లు క్యారెక్టర్ గురించి ముందుగానే తెలుసు కాబట్టి సినిమా స్టార్టింగ్ నుండే అ పాత్రతో చాలా ఈజిగా కనెక్ట్ అయిపోతారు. పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా లాజిక్స్ వుండవు కానీ మ్యాజిక్ ఉంటూంధి . కొన్నిసార్లు టిల్లుగాడు తన మ్యానరిజంతో, డైలాగ్స్తో మనకు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా చేస్తాడు . కథలో సీన్టూ సీన్ కనెక్షన్ వుండటం వలన మనకు చిరాకు ఏమి అనిపించధు ధాని వలన కథను ముంధుకు వెలుతుంధి . కావాలని ఊరికే తెచ్చిపెట్టినట్టు ఏమి వుండవు . కథలో వచ్చే కొన్ని ట్విస్టులు అయితే ప్రేక్షకుడిని బలే ఎంటర్టైన్ చేస్తాయి .ఆసుపత్రిలో జరిగే సీన్ చాలా పొడవుగా వున్న కుద చాలా బాగా ప్రేక్షయజుడు ఎంటర్టైన్ అవుతాడు . అయిన కూడా ఎక్కడ బోర్ అనిపించదు . నిడివి చాలా తక్కువగానే ఉండటం వలన కూడా సినిమా ఏంటి వెంటనే సినిమా అయిపోయినధి . ఇంకొంత సమయం ఉంటే బాగుంటుంధి కధా అనే ఫీల్ అయితే కచ్చితంగా వస్తుంధి.

టిల్లు’లోని రాధిక ఎపిసోడ్ని చూపిస్తూ కథను ప్రారంభిస్తాడు దర్శకుడు. దాని వలన సినిమా చూడని వారికి కూడా రాధిక పాత్రపై కాస్త అవగాహన వస్తుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించి.. నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. లిల్లి పాత్రను పరిచయం చేస్తాడు .. ఆ తర్వాత ఒక చిన్న టిస్టు రావడం.. తరువాత బర్త్డే పార్టీ రోజు మరో షాక్.. ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టిస్టు చాలా బాగుంటుంది. సెకండాఫ్ లో కామెడీ డోస్ కొంచెం తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ ఎంట్రీ తర్వాత కథనం రొటీన్ గా, సినిమాటిక్గా సాగుతుంది. అయితే ప్రీక్లైమాక్స్ నుంచి వచ్చే ట్విస్ట్లు అయితే ప్రేక్షకుడుని అబ్బురపరిచేలా చేస్తాయి . క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని చాలా ఆకట్టుకుంటాయి. కొన్ని dailogues అయితే యూత్కి చాలా బాగా నచ్చుతాయి.

Who acted how?

టిల్లుగాడి పాత్ర సిద్ధూ జొన్నల గడ్డకు ఎంత పేరు సంపాదించిపెట్టిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రను సిద్ధు తప్పా ఎవరూ చేయలేరు అనేంతలా నటించాడు. అల్రెడీ చేసిన పాత్రే కాబట్టి చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని ఎక్కడికో తెసుకెళ్లయి . అనుపమ ఈ మూవీలో కొత్త పాత్రను పోషించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో ఆమె నటించలేదు. లిల్లిగా ఆమె తెరపై అందాలను పంచడమే కాకుండా.. తనదైన నటనతో బొల్డ్ సీన్లలో కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకునేల చేసింధి . ఆమె కారెక్టర్లో వచ్చే సర్ప్రైజులు, ట్విస్టులు ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ మరియు టిల్లు ఇద్దరి మధ్య వచ్చే కామిడీ సన్నివేశాలు చాలా బాగుంటాయి. . మురళీ శర్మ, ప్రిన్స్తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

technical experts

సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన ‘డీజీ టిల్లు… లీరిక్స్, ‘రాధికా రాధికా’ పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన ‘ఓ మై లిల్లీ’ సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. భీమ్ అందించిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్రధాన బలం, సినిమాటోగ్రఫీ, చాలా ఆకర్శనీయంగా ఉంటుంధి .ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివే ఉండడంతో సినిమా త్వరగానే అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి ఈ సమ్మర్లో ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ మూవీ చూడాలనుకునే వారికి టిల్లు స్క్వేర్ చాలా మంచి సినిమా ఎక్కడ మిమ్మల్ని నిరాశ పరచదు.

1 thought on “Tillu square movie reveiw in telugu”

Leave a Comment