Family star movie

టైటిల్ : ఫ్యామిలీ స్టార్

విడుధల తేదీ : ఏప్రిల్ 05, 2024

నటీనటులు : విజయ్ దేవరకొండ , మృణాల్ ఠాకూర్ ,ప్రియాంశ కౌశిక్ ,వాసుకి ,వెన్నెల కిశోర్ తదితరులు నటించారు.

నిర్మాణ సంస్థ : శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాతలు : దిల్ రాజు -సిరిష్

దర్శకత్వం మరియు రచయిత : పరశురామ్

మ్యూజిక్ : గోపిసుందర్

ఆర్ట్ డైరెక్టర్ : ఏ యస్ ప్రకాశ్

సినిమాటోగ్రఫి : కెయు మోహన్

ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్।

family star movie buzz

విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కలిసి జంటగా నటించిన చిత్రం family star. గతంలో వచ్చిన గీత గోవిందం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పరశురామ్ డైరక్షన్లో విజయ్తో రెండవసారి కలిసి వస్తున్న సినిమాకి బారిగా అంచనాలు పెరిగాయి. అలాగే ఈ మధ్య రిలీజ్ అయిన teaser అండ్ సాంగ్స్, ట్రైలర్ లకు మంచిగానే స్పందన వచ్చింది దానితో సినిమాపై మరింత ఆశక్తి పెరిగింది. .వేసవి సెలవులు అనగానే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్కి పోటీ పడుతూ ఉంటాయి . యువతకు గుర్తొచ్చేది ఏమి సినిమాలు రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు . ఈ వారం మన ముందుకు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చేసింది .

what is family star story

విజయ్ సివిల్ ఇంజనీర్గా పెద్ద కంపెనీలో జాబ్ వచ్చినప్పటికీ ఫ్యామిలీకి దూరంగా వెళ్ళటం ఇష్టం లేక హైదరాబాద్లో ఒక చిన్న కంపెనీలో జాబ్ జాబ్ చేసుకుంటూ వుంటాడు . తనకు కుటుంబం అంటే ప్రాణం.తన ఫ్యామిలీకి ఎటువంటి కష్టం రాకుండా తన అన్న పిల్లలు వదిలని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.విజయ్ వాళ్ల అన్న మందు తాగడానికి కారణం విజయేనా? మృణాల్ విజయ్ వాళ్ల ఇంట్లో అద్దెకు ఉండటానికి వచ్చి వాళ్ల ఫ్యామిలీతో బాగా కలసిపోతుంధి. విజయ్ అండ్ మృణాల్ ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడతారు. మృణాల్ విజయ్ మీద అతనికి తెలీకుండా బుక్ రాయడం దానివల్ల విజయ్కి కోపం వచ్చి మృణాల్ని ఎందుకు కొట్టాడు? అసలు ఆ బుక్ లో ఏముంధి? మరలా వీరిద్దరూ కలిశారా ? ఒకవేళ ఇద్దరూ కలవాల్సి వస్తే? వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటే ప్రాజెక్టుకు పనిచేయాల్సి వస్తే ఆ ప్రాజెక్టు ఫినిష్ చేశారా? లేక ఆ ప్రాసెస్లో మళ్ళీ వీరిద్దరూ కలిశారా? ఆ కోపం ఇంకా పెరిగిందా ?తెలుసుకోవాలంటే ఫ్యామిలీ స్టార్ మూవీ తెరపై చూడాల్సిందే?

how is family star story

తన కుటుంబాన్ని తన జీవితంలోకి వచ్చిన అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన ఒక యువకుడి కథే ఈ చిత్రం . మృణాల్ కథను narrate చేస్తుంది. విజయ్ డైలీ చేసే పనులతో స్టార్ట్ అవుతుంది . విజయ్ తన ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడు మనీ ఎలా పొదుపు చేస్తాడు విజయ్కి కుటుంబం పట్ల ఉండే బాధ్యత ప్రేమను గుర్తు చేస్తాయి. అలాంటి విజయ్ జీవితంలోకి తనలాగే ఫ్యామిలీని ప్రేమించే అమ్మాయి మృణాల్ రావడం వారితో కలసిపోవడం . తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే వారికి ఎలాంటి సమాదానం ఇవ్వాలి లాంటి ఫైట్ చాలా బాగుంటుంది. మృణాల్ గురించి విజయ్కు తెలిసి అపార్ధం చేసుకుని వారిద్దరి మద్య జరిగే గొడవ సీన్ ప్రేక్షకుడిని బాగా కనెక్ట్ చేస్తుంది. స్టోరీ పరంగా పెద్దగా ఏమి వుందదు. కథనంలో అక్కడక్కడ కొంచెం సాగతీస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో మృణాల్ అండ్ విజయ్ మధ్య జరిగే సీన్స్ కొన్ని ఎంటర్టైన్ చేస్తాయి. మరలా విజయ్కి మృణాల్ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ సపోర్ట్ చేసే సీన్ కొంచెం ఎమోషన్ గా ఉంటుంది. ప్రాజెక్టు ఫినిష్ చేశాక క్రెడిట్ మృణాల్ కి వెళ్లిపోతున్నప్పుడు తను ఫీల్ అయ్యే సీన్ ప్రేక్షకుడికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది .మరలా ఫ్రీ క్లైమాక్స్లో జగపతి బాబు విజయ్కి మృణాల్ గురించే నిజం చెప్పే సీన్ ఎమోషనల్గా ఉంటుంది. తరువాత క్లైమాక్స్ లో జరిగే ఫైట్ చాలా బాగుంది. మొత్తానికి సమ్మర్ లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకునే వారికి ఇదొక మంచి సినిమా అనే చెప్పాలి.

Who acted how? in family star

విజయ్ దేవరకొండ గోవర్ధన్ పాత్రలో వదిగిపోయాడు. ప్రతిసీన్ లో తన యాక్టింగ్తో తనదైన స్టైలిష్ లుక్ తో సెబాష్ అనిపిస్తాడు. మృణాల్ ఇందు పాత్రలో వదిగిపోయింది. ఫ్యామిలీతో కలిసిపోయే సీన్స్ నవ్విస్తూ కవ్విస్తూ మరియు ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్ చాలా మెప్పిస్తుంది. వెన్నెల కిశోర్కి మరియు విజయ్ మద్య జరిగే సీన్స్ కొంచెం ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తాయి రోహిణి బామ్మపత్ర చాలా బలమైన కారెక్టర్ తనదైన పాత్ర మేరకు మెప్పించింది. ప్రబాష్ శ్రీను మరియు మిగతా పాత్రలు వారి పాత్ర మేరకు మెప్పించారు.

technicalities

గోపిసుందర్ మ్యూజిక్ అంధించిన అన్నీ పాటలు చాలా బాగున్నాయి అందులో ప్రత్యేకంగా కళ్యాణి కళ్యాణి సాంగ్ చాలా బాగుంటుంది. సినిమాకి మరో బలం నేపద్య సంగీతం చాలా బాగుంది. కెయు మోహన్ సినిమాటోగ్రఫీలో picturisation కెమెరాను చిత్రీకరించిన విదానం సినిమాలో చాలా బాగుంటుంది. ఎడిటింగ్ పరంగా సినిమాలో పెద్దగా స్కోప్ ఏమి లేధు కానీ మార్తాండ్ కె వెంకటేష్ బాగానే చేశాడు.

Leave a Comment