PM Narendra Modi how many days holidays taken past few years

మనం సాదారణంగా ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా ఎప్పడూ బయటకి వెళ్ళి తిరుగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాము. వారానికి  ఐదు రోజులు పనిచేస్తే రెండు రోజులు ఖచ్చితంగా సెలవు తీసుకుంటాం. కనీసం సండే రోజయితే  పక్కాగా సెలవు  ఉంటుంది. వీటికి అదనంగా మరలా అప్పుడప్పుడు  పబ్లిక్ హాలిడేస్కు ఎలాగూ సెలవు వస్తుంది. ఆరోగ్యం బాగాలేనప్పుడో లేక మన బందువుల ఫంక్షన్ కోసమో సెలవు తీసుకుంటాం. ఇది అందరూ ఉద్యోగులు దాదాపు ఇలానే చేస్తారు. ఇంకొందరైతే నెలకు ఐదారు సెలవులు కూడా పెడతారు. సంవత్సరానికి 30, 40 లీవ్స్ పెట్టుకుంటారు. ఇంకా ఎక్కువ కూడా పెట్టవచ్చు. కానీ మనందరికి సెలబ్రిటీలు మరియు పొలిటీసియన్స్ గురించి తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది.వారి గురించి తెలుసుకోవాలని చాలా కోరికగా కూడా ఉంటుంది. అటువంటిది PM Narendra Modi గురించి తెలుసుకోవాలని ఎంతమందికి ఉండదు చెప్పండి అందరూ ఎప్పుడెప్పుడు తెలుసుకుందామని అని తెగ సంబరపడిపోతారు.

 అను నిత్యం ఎంతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారో మీకు తెలుసా? ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ  గారు పొద్దున లేచిన దగ్గరి నుండి సాయంత్రం పడుకునే వరకు  చాల బిజీగా ఉంటారు. ప్రతి క్షణం దేశ అబివృద్ది కోసం చాలా దేశాలు తిరగాల్సి ఉంటుంది. ఎవరినెవరినో కలవాల్సి ఉంటుంది. వారు  అంత యాక్టివ్గా ఎలా ఉంటారు. వారి మోటివేషన్ ఎలా ఉంటుంది. అని తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.అతని పదవీకాలం పదేళ్ళు పూర్తి అయ్యింది. ఈ పదేళ్ళలో ఎన్నిసార్లు సెలవు పెట్టారు.  ఈ పదేళ్లలో ఎన్నో సెలవులు తీసుకోవచ్చు. అతనికి పర్సనల్గా కూడా  చాలా లీవ్స్ ఉంటాయి. కానీ అందులో ప్రధాని మోదీ గారు  ఎన్ని లీవ్స్ వాడుకున్నారో ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? 

ప్రధాని నరేంద్ర మోదీ సెలవులకు సంబంధించి వారణాసిలోని దృష్టి ఐఏఎస్ కోచింగ్ ప్రొఫెసర్, ఆర్టీఐ కార్యకర్త శేఖర్ కన్నా  ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం కోరారు. ప్రధాని మోదీ లీవ్స్ వివరాలు ఇవ్వాల్సిందిగా 2024 మార్చి 16న ఆయన ఆర్టీఐ దరఖాస్తు చేశారు. నెల రోజుల్లోనే ప్రధాని కార్యాలయ అదనపు కార్యదర్శి పర్వేశ్ కుమార్ సంప్రదించగా ఆయనకు లిఖితపూర్వక సమాచారం అందించారు. ఏప్రిల్ 15న శేఖర్ ఖన్నాకు సమాధానం వచ్చింది.దానిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఎందుకంటే గడిచిన  పదేళ్లలో ప్రధాని మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు.

ఈ వయస్సులో కూడా ఆలా కస్టపడటం చూసి మనం ప్రదాని మొదీ  గారు దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకోవాలి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం అన్నీ పనుల్లో  చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. తాను ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి  ఇప్పటి వరకు విరామం ,విశ్రాంతి  లేకుండా బారతదేశ బాగుకోసం అనుక్షణం పనిచేసే ఏకైక వ్యక్తి. సాదారణంగా  ప్రతి ఇంట్లో నాన్న కస్టపడతారు పిల్లలు సుఖపడతారు అలాంటిది ఇన్ని కుటుంబాల బాగుకొరకు అనుక్షణం నిరంతరం పాటుపడుతున్న ఏకైక  వ్యక్తి  నరేంద్ర మోదీ గారు 

కొన్ని రోజుల క్రితం ఒకసారి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని  గారిని ఇంటర్వ్యూ చేశారు. అందులో చాలా ప్రశ్నలడిగారు చాలా వాటికి చక్కగా జవాబులు కూడా ఇచ్చారు. అక్షయ్ కుమార్ మోదీ గారిని మీరు ప్రతి రోజు ఎన్ని  గంటలు నిద్ర పోతారు అని అడిగిన ప్రశ్నకు  తాను రోజుకు మూడున్నర నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని దానికి సమాదానం ఇచ్చారు.. మిగిలిన 18 గంటలు పనిచేస్తాని చెప్పారు .బీజేపీ ఘనంగా విజయం సాదించిన తర్వాత  అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా  సరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు . అంత సామాన్యమైన విషయం కాదు.

ఒక పక్క రాష్టాన్ని సంబందించి ఏ ఇబ్బంది లేకుండా మరో పక్క దేశ ప్రదాని బాధ్యతలని  చేపడుతూ ఒక్కడే చేయడం మనందరం గౌరవపడాల్సిన విషయం. మహానుబావులు ఎందరో ఉంటారు అలాంటీ పనులలో వారికి వారే పోటీ మరెవ్వరు  రారు వారికి సాటి అనేలా చేశారు.  2014 నుండి  ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగుతున్నారు. పదేళ్లలో సుమారు  65,700 గంటలు అంటే 3650 రోజులు పనిచేశారు. అంటే ప్రధాని మోదీ ప్రతిరోజూ 18 గంటల పాటు దేశ సేవలో నిరంతరం ఎంత పనిచేస్తున్నారో . మనం అర్ధం చేసుకోవాలి. తనకు దేశహితమే ముఖ్యమని దానికోసం ఎంతదూరమైన వెలతానని దేశ సంరక్షణ కోసం తన ప్రాణాన్ని సైతం కూడా లెక్కచేయనని కూడా చాలా సబలల్లో చెప్పుకొచ్చారు. ఇంకా మనదేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది దానిని  నిర్మూలించడానికి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు.

Leave a Comment