Pawan Kalyan is a tireless wayfarer fighting for people’s problems

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ నేటితో పూర్తవనుంది. అయితే ఏపీ రాజకీయాల్లో Pawan Kalyan నిజంగానే ఇప్పుడున్న వారందరికంటే చాలా ప్రత్యేకమని చెప్పాలి. అన్ని పార్టీలు ఒకెత్తు అయితే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెక్క మాత్రం వేరే. పదేళ్లుగా ఒక్క ఎమ్మెల్యే సైతం గెలవకపోయినప్పటికి వంటి చేత్తో పోరాటం చేస్తున్న యోదుడు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎవరికి వారు విజయం సాధించాలని ఆశతో అన్ని రాజకీయ పార్టీలు వారి వారి వ్యూహాలతో ఎదురు తెగ చూస్తున్నారు. వారి వ్యూహాలతో ఎలా ముందుకు తెసుకెళ్లాలని తెగ ఆలోచిస్తున్నారు.

Janasena’s daring step into politics

సినిమా రంగంలో star ఇమేజ్ ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ వదిలి పార్టీ పెట్టాడు. ఏపీలో రాజకీయాలు ప్రారంభించిన అప్పటి  నుండి  పవన్ కళ్యాణ్ అనేక ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కొన్నారు. గత పదేళ్లుగా ఆయన పార్టీని నడుపుతున్నారు. ఏ ఒక్కరోజు కూడా అలసిపోలేదు. ఎన్నికల్లో ఓటమి పాలైనా  కూడా ఆయన ఒక్కడే మనో ధైర్యంతో మళ్ళీ ఏపీ ఎన్నికల బరిలోకి దూకారు. సాదారణంగా ఇంకోకరైతే మనకెందుకు అవసరమా వదిలేద్దాం అనుకుంటారు. కానీ పట్టు వదలని విక్రమార్కుడు లాగా రాత్రిపగలు పోరాడుతున్నారు. తన కోసం తను ఏదైనా చేసుకోవచ్చు కానీ జనాల కోసం ఏదో చేయాలని పట్టుదలతో నిలబడ్డాడు కనకే వెనకడుగు వెయ్యట్లేదు. ఒక్క స్థానం కూడా గెలవకుండా పార్టీను ముందుకు కొనసాగించడం అంటే అంతా తేలికైన విషయమైతే కాదు. గెలుపు కోసమైతే కాదు జనాల శ్రేయస్సు కోసం వారికి మంచి జరగాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గెలిస్తే ప్రశ్నించడానికి ఒక దైర్యం వస్తుంది. జనాల ఆశల మీద కొట్టేవారికి జనాల ఆయుస్సు పెంచడానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆశ కోసం కోసం ఏదైనా చేస్తారు పవన్ కళ్యాణ్ కున్న ఏకైక ఆశయం ప్రజలకు మంచి చేయాలని ఒక్కటే. మంచిపై చెడు వెయ్యి సార్లయిన గెలవచ్చు కానీ అదే చెడుపై మంచి ఒక్కసారి గెలిస్తే చాలు నామరూపాలు లేకుండా పోతాయి. 

Pawan has been fighting for the people of Andhra for ten years

 సాదారణంగా తనని నమ్మిన  ప్రజల కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు కానీ తనని నమ్మకపోయిన కూడా వాళ్ల కోసం పోరాడుతున్నాడు చూడు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నాకేంటి నన్ను నమ్మటం లేదుగా వదిలేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు. అలా వదిలి పెట్టలేదు అలా వదిలేయడం అతనికి రాదు. ఎన్ని సార్లు ఓడిపోయిన పరవాలేదు ఒక్కసారయినా గెలుస్తాననే నమ్మకం ఉంది. కనకే అతను పోరాడుతున్నాడు.  జనాల సమస్యలుకై పోరాడుతున్న వారికి  ఇలాంటివి తప్పవు. తనను గత ఎన్నికల్లో ఆదరించని ప్రజల సమస్యల కోసం ఆయన పోరాటం చేస్తూనే ఉంటారు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పదేళ్లుగా ఒక్కడే పోరాడుతున్నాడు. అంటే అతని దైర్యం ఏంటో అర్ధమవుతుంది. ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది ఒక్కడితోనే సాద్యమవుతుంది. ఒకప్పుడు అడవి కూడా  ఒక విత్తనముతోనే మొదలయ్యి ఉండవచ్చు కానీ ఇవాళ అదే విత్తనం నుండి వచ్చిన మొక్కలు  ఒక పెద్ద అడవిని చేసింది . గెలవక పోయిన తన సొంత డబ్బుతో చాలా చేస్తున్నారు ఒక్కసారి గెలిపిస్తే ఇంకెంత చేస్తారు చేస్తారు ఆలోచించండి ఇంకా ఆయన మాటల్లో తండ్రిలాంటి బాద్యత ఉంది  కనకే ఇంటికి ఏదైనా కస్టమ్ వస్తే ఏ తండ్రి మద్యలో వదిలి పెట్టి వెళ్ళడు దానిని పూర్తి చేశాకే వెళతాడు ప్రశాంతంగా ఉంటాడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా జనాల సమస్యలను పూర్తి చేశాకే  మనశ్శాంతి గా ఉంటాడు. 

Pawan Kalyan did not enter politics as a legacy

 మద్య తరగతి నుండి వచ్చిన వారికే జనాల మద్య ఉన్న కష్టానష్టాలు తెలుస్తాయి.  చిన్నప్పటి నుండి నేను మద్య తరగతిలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టే  నాకు జనాల బాదలు వారి బాద్యతలు తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు నేను మిగతా వారి లాగా  తాతల, తండ్రుల వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చిన వాడిని కాదని, సుఖాలని విడిచి రాజకీయాల్లోకి వచ్చిన వాడినని అన్నారు . నా ప్రయాణం ఒక అలుపెరగని సముద్రం అన్నారు. నాకు ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆటు పోట్లు వచ్చిన మీరున్నారనే దైర్యమే నన్ను వాటిని తట్టుకునేల చేస్తుందన్నారు. నేను ఒక అలుపెరగని బాటసారిని ఏదో ఒక మార్గం  కనుక్కున్నాకే నా గమ్యం పూర్తవుతుంది అన్నారు. గమనం ఏదయినా  కావచ్చు జనాల సమస్యలను పూర్తిచేయడమే తన గమ్యం అన్నారు 

Pawan’s politics is for the good of the people, not for positions

  ఆంధ్ర రాష్ట్రంలో ఈసారైనా ప్రజా సంక్షేమ పాలనను ముందుకు తీసుకెళ్లడం కోసం తమ పార్టీ సీట్లు వదులుకుని మంచి జరగడం కోసం పొత్తులకు వెళ్లామని చెప్పారు. నిజంగానే ఆయన దేశంలోనే ఒక బలమైన రాజకీయ నాయకుడు ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో ఒక్క ఎమ్మెల్యే సైతం లేకున్నా కూడా ఒక్కడే  ఎలాంటి పదవులు లేకున్నా పదేళ్ళపాటు పోరాటం చేస్తున్న నాయకుడు. మరి ఆయన మాటలు ఈసారి జనసేన ఓట్ల సంఖ్యను పెంచుతుందా? ఈసారైనా ఆయన  రాజకీయాల్లో కీలకంగా మారతారా? లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Leave a Comment