ON innocent people stabbing in Australia Sydney mall thugs

stabbing in Australia Sydney లో విశాలంగా ఉండే వెస్ట్‌ఫీల్డ్ బోండి జంక్షన్ మాల్ కాంప్లెక్స్‌లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఈ సంఘటనలు జరిగాయి, ఇది శనివారం మధ్యాహ్నం ఆ మాల్ అంతటా దుకాణదారులతో నిండిపోయింది.

ప్రతి శనివారం రద్దీగా ఉండే సిడ్నీ షాపింగ్ సెంటర్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి విధ్వంసం చేయడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు మరియు అనేక మంది గాయాలపాలయ్యారు అని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు.గుర్తు తెలియని దుండగుడు పలువురిని కత్తితో పొడిచి ఆక్కడే చంపేశారు అక్కడ , సంఘటనా స్థలంలో ఒక పోలీసును ఎదురుగా వచ్చినందుకు దారుణంగా కాల్చిచంపారు .

న్యూ సౌత్ వేల్స్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్ ఆంథోనీ కుక్ గారు ఆ నేరస్తుల చర్యలను గమనించి వారిని పట్టుకుని శిక్షిస్తామని చెప్పారు . దానికోసమే దుండగులను మా పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు అని చెప్పారు. దీని ఉద్దేశం వెంటనే ఏంటనేది ఎవరు ఎందుకు చేశారో స్పష్టంగా చెప్పలేము , అయితే ఈ దశలో ఉగ్రవాదంను తోసిపుచ్చలేమని కుక్ అన్నారు.

గాయపడ్డ ఎనిమిది మంది రోగులను సిడ్నీలో ఉన్న వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లడం జరిగినది, ఇందులో ఒక చిన్న పిల్లవాడు నగరంలోని పిల్లల ఆసుపత్రికి తరలించాము అని న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ ప్రతినిధి AFP కి చెప్పారు, ఇంకా వారికి చాలా తీవ్రంగా కూడా గాయాలు అయ్యాయని వారు నొప్పిని బరించలేక బోరున విలపిస్తున్నారని తెలియజేశాడు.

మాల్ ఓనర్ని పిలిపించి సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ చూస్తున్నప్పుడు అందులో ఆస్ట్రేలియన్ రగ్బీ లీగ్ జెర్సీ ధరించిన వ్యక్తి పెద్ద కత్తితో షాపింగ్ సెంటర్ చుట్టూ పరుగులు తీయడం మరియు గాయపడిన వ్యక్తులు నేలపై కాల్చి పడి ఉండడం చూపించింది.

ప్రత్యక్ష సాక్షులు అక్కడ నుండి పరుగు తీస్తున్న తీరును కూడా పరిశీలించారు . బయంతో అక్కడ ఉన్న దుకాణదారులు తమను తాము రక్షించుకోలేక బయంతో వనికిపోయారు. మరియు పోలీసులు ఆ ప్రాంతాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.కొంతమంది ప్రజలు తమ కుటుంబాలను రక్షించుకునేందుకు పలువురు దుకాణాల్లో లోపలికి వెళ్ళి తలదాచుకున్నారు. ఒక్కసారిగా ఆప్రాంతమంత పరుగులు అరుపుల కేకలతో ఒక విద్వంశంలా మారింది.

ప్రంజూల్ బొకారియా అప్పుడే ఏదో చిన్న పని ఉంటే ముగించుకుని శోపింగ్ చేస్తుండగా మద్యలో పెద్ద పెద్దగా అరుపులు ఏంట్రా బాబు అని చూస్తే అక్కడ కత్తితో పొడుస్తుండడం అక్కడే పోలీసుల్ని కాల్చడం అంతా వెంట వెంటనే జరిగిపోయాయి. ఇది చూసి ఆమె సమీపంలోని దుకాణానికి పరిగెత్తడం మరియు బ్రేక్ రూమ్‌లో ఆశ్రయం పొందింది.ఇది చాలా భయానకంగా ఉంది, అని కొంతమంది మానసికంగా బలహీనంగా మరియు ఏడుస్తూ ఉన్నారు అని ఆమె AFP కి చెప్పారు.

ఆమె ఇతర దుకాణదారులు మరియు సిబ్బందితో అత్యవసర మార్గాన్ని ఉపయోగించి అక్కడ నుంచి ఎలా తప్పించుకుంది. వారిని ఎలా బద్రపరచగలిగాను అనేది వివరించింది. వారిని వెనుకాలా వీధికి ఎలా తీసుకువెళ్లింది. ప్రజలు నడుస్తున్నారు మరియు పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.నేను పూర్తి సృహ తో ఉన్నప్పుడే ఈ సంగఘటన అంతా జరిగినది ఆమె చెప్పింది.

రీస్ కోల్మెనారెస్ జిమ్‌కి వెళుతుండగా, ఒక్కసారిగా బయంతో కేకలు వేయడం అరవడం ప్రజలు పరిగెత్తడం చూసింది.ఎవరో కత్తితో పొడిచినట్లు ప్రజలు చెబుతున్నారని, అందుకే 10 నుండి 12 మంది వ్యక్తులతో కలిసి సమీపంలోని హార్డ్‌వేర్ దుకాణంలోకి వెళ్లినట్లు ఆమె AFPకి తెలిపింది.

“వారు మమ్మల్ని ఒక గదిలోకి తీసుకువెళ్లారు మరియు దుకాణాన్ని మూసివేశారు అని ఆమె చెప్పింది.ఇది భయానకంగా ఉంది, ప్రతిచోటా చిన్న పిల్లలు మరియు వృద్ధులు మరియు వీల్ చైర్లలో ఉన్న వ్యక్తులు ఉన్నారు ఎటు వెల్లాలో తెలీక అక్కడే బోరున విలపిస్తున్నారు .

రాత్రి అయ్యేసరికి అక్కడకి ఎక్కువ మంది పోలీసులు మరియు అంబులెన్స్‌లు షాపింగ్ కాంప్లెక్స్ వెలుపల ఉన్నాయి, ప్రజలను సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్‌లు సిద్ధంగా ఉన్నాయి. పోలీసుల సైరన్‌లు, హెలికాప్టర్‌ల మోతతో ఆకాశమంతా మార్మోగింది.మాల్‌కు తాళం వేసి పోలీసులు ఆ ప్రాంతాన్ని నివారించాలని ప్రజలను కోరారు.

ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ దాడిపై ఆస్ట్రేలియన్ల విచారం మరియు ఆ సంఘటన విని ఒక్కసారిగా టెన్షన్కి గురయ్యారు. హింసాత్మక నేరాల రేటు చాలా తక్కువగా ఉన్న ఆస్ట్రేలియాలో ఇటువంటి దాడులు జరగడం మానసిక ఆందోలనకు గురయ్యేలా చేసింది అన్నారు.

Leave a Comment